కర్నూలులో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం
రిపోర్టర్: హరి
స్థలం: కర్నూలు
కర్నూలు నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రాంబొట్ల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి టి.జి. భరత్, కలెక్టర్ డా. ఎ. సిరి, ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఈ శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది.