'నాలుగు దశాబ్దాల కల సాకారం': భోగాపురంలో రైతుబజార్ ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: భోగాపురం

భోగాపురం ప్రజల నాలుగు దశాబ్దాల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. సుమారు 74 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన భోగాపురం రైతుబజార్‌ను నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో స్థానిక రైతులకు, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు ఒకే చోట లభించడంతో పాటు వ్యాపార సౌలభ్యం కలగనుందని, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.