పట్టణ స్థానిక సంస్థల్లో రూ.50 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం

రిపోర్టర్: అశోక్ స్థలం: చిత్తూరు

పట్టణ స్థానిక సంస్థల్లో రూ.50 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం శివపురం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రూ.11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమిషనర్లు, ఎమ్మెల్యేలు ఉదయం 6 గంటలకే రోడ్లపైకి వచ్చి పనులను పరిశీలించాలని, రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్లన్నీ పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.