పాఠశాల మైదానంలో వాటర్ ట్యాంక్ నిర్మాణమంటూ చెన్నూరు ప్రజల ఆగ్రహం

రిపోర్టర్: కిరణ్ స్థలం: చెన్నూర్

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టడంపై క్రీడాకారులు, నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ మైదానంలో ప్రాక్టీస్ చేసి ఎంతోమంది ఉద్యోగాలు సాధించారని, ఇప్పుడు ట్యాంక్ నిర్మాణంతో క్రీడలకు ఆటంకం కలుగుతోందని వాపోయారు. రూ.కోట్లతో నిర్మించిన మినీ స్టేడియాన్ని పూర్తి చేసి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.