గుంటూరు జీజీహెచ్‌కు అప్పగింత: గవర్నర్ అబ్దుల్ నజీర్ సొంత నిధులతో అత్యాధునిక పరికరం
రిపోర్టర్: రాజేష్
స్థలం: గుంటూరు
గవర్నర్ అబ్దుల్ నజీర్ తన సొంత నిధులు పన్నెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలతో గుంటూరు జీజీహెచ్‌కు అత్యాధునిక కోయాగ్యులేషన్ ఎనలైజర్ పరికరాన్ని అందజేసినట్లు వైద్యులు వెల్లడించారు. పాథాలజీ విభాగంలో ఏర్పాటు చేసిన ఈ పరికరాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గాప్రసాద్, జీఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి మంగళవారం ప్రారంభించారు. తీవ్ర రక్తస్రావ సమస్యలు, గుండె జబ్బుల బాధితులకు ఈ పరికరం ద్వారా రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని అత్యంత వేగంగా, కచ్చితత్వంతో పరీక్షించి నిరుపేద రోగుల ప్రాణాలను రక్షించవచ్చని వారు తెలిపారు.