తెలుగుదేశం పార్టీలో చేరిన నాయుడువలస పాలవలస ముప్పై కుటుంబాలు

రిపోర్టర్: GANESH BBL స్థలం: రామభద్రపురం

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం నాయుడువలస, పాలవలస గ్రామాలకు చెందిన ముప్పై కుటుంబాలు బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు సమక్షంలో గురువారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాము పార్టీలో చేరినట్లు వారు స్పష్టం చేశారు.