టెక్ మార్కెట్లో కలకలం: త్వరలో రెనో 17 సిరీస్ మొబైల్స్ విడుదల
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో త్వరలోనే మార్కెట్లోకి కొత్త రెనో 17 సిరీస్ ఫోన్లను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త సిరీస్‌లో భాగంగా రెనో 17 ఎఫ్ 5జీ మోడల్ ఇప్పటికే థాయ్‌లాండ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్‌తో పాటు పలు అంతర్జాతీయ రెగ్యులేటరీ అనుమతులను విజయవంతంగా పొందినట్లు టెక్ నిపుణులు పేర్కొన్నారు. త్వరలో ఈ అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్లను ప్రపంచ మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు స్పష్టంచేశారు.