నాగ్‌పుర్‌లో పర్యావరణ హితంగా యాభై ఐదు అడుగుల కాగితపు వినాయక విగ్రహం
రిపోర్టర్: శివ
స్థలం: నాగ్‌పుర్
మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని ధాబా ప్రాంతంలో శ్రీ గణేష్ మహోత్సవ్ మండల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా యాభై ఐదు అడుగుల భారీ కాగితపు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహావిష్ణువు శయన భంగిమలో రూపొందించిన ఈ విగ్రహం కోసం ముంబై, గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి ఆరు వందల కేజీల కాగితాన్ని తెప్పించారు. స్కూల్ టీచర్ శశాంక్ తురాంకర్ నేతృత్వంలో పన్నెండు మంది సభ్యుల బృందం ఇరవై రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని నిర్మించగా, ఇది వరల్డ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ ఇండియాలో చోటు సంపాదించుకుంది.