మిడ్జిల్ కరువు మండలాల జాబితాలో చేర్చాలంటూ సీపీఎం నేతల డిమాండ్
రిపోర్టర్: సురేష్
స్థలం: మహబూబ్ నగర్
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి నష్టపోయిన మిడ్జిల్ మండలాన్ని కరువు మండల జాబితాలో చేర్చకపోవడం విడ్డూరమని సీపీఎం రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్, జిల్లా కార్యదర్శి ఏ. రాములు ఆరోపించారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎండిన ఎకరం వరిపొలానికి ఇరవై ఐదు వేల రూపాయల పరిహారం చెల్లించాలని, లేనిచో ఆందోళన చేపడతామని వారు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.