అన్నదాతల ఆక్రోశం: అకాల వర్షానికి నేలకొరిగిన వరి పంటలు
రిపోర్టర్: మహేష్
స్థలం: మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అకాల వర్షానికి వరి పంటలు నేలకొరగడం తీవ్ర ఆవేదన కలిగించిందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు వెల్లడించారు. చేతికి వచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రైతులను సమీకరించి పెద్దఎత్తున ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని ఘాటుగా హెచ్చరించారు.