టీటీడీలో కలకలం: ఏసీబీ వలలో డిప్యూటీ ఈవో లోకనాథం
రిపోర్టర్: రాము
స్థలం: తిరుపతి
తిరుమల డిప్యూటీ ఈవో ఎం. లోకనాథం అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కడంతో టీటీడీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. లడ్డూ నెయ్యి కల్తీ కేసుతో ఈ అరెస్టుకు సంబంధం లేకపోయినా, సీబీఐ సమాచారంతో ఏసీబీ దాడులు జరగడం కలకలం రేపుతోంది. మరికొందరు ఉద్యోగులు కూడా ఏసీబీ రాడార్లో ఉన్నారనే ప్రచారం టీటీడీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.