రైల్వే ప్రయాణికులకు తీపి కబురు: విజయవాడ తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయవాడ
తిరుమల బ్రహ్మోత్సవాలు మరియు పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి విజయవాడ మార్గంలో జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల పదిహేడు నుంచి ఇరవై వరకు ఎనిమిది ట్రిప్పులు నడవనున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.