బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిల బెయిల్ రద్దు కోరుతూ సైఫాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ నిబంధనలను ఉల్లఘించి సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారని పోలీసులు కోర్టుకు తెలిపారు. డిజిటల్ ఆధారాలు సమర్పించి, కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టుకు బదిలీ చేయాలని కోరారు.