టాలీవుడ్లో చర్చగా నందమూరి బాలకృష్ణ వంద కోట్ల విలాసవంతమైన కొత్త ఇల్లు

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో నందమూరి బాలకృష్ణ కుటుంబం కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఓ విలాసవంతమైన భవనం సిద్ధమవుతోందని సినీ వర్గాలు వెల్లడించాయి. దాదాపు పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ నివాసంలో హోమ్ థియేటర్, జిమ్, స్విమ్మింగ్ పూల్తో పాటు ప్రత్యేక వసతులు కల్పించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భవనం విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.