భక్తిశ్రద్ధలతో ముస్తాబవుతున్న చిన్నరావుపల్లి ఆశిరితల్లి ఉత్సవాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎచ్చెర్ల
ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో శ్రీ ఆశిరితల్లి గ్రామ దేవత ఉత్సవాలు ఈనెల 22వ తేదీన ఘనంగా నిర్వహించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కమిటీ సమావేశంలో గ్రామ పెద్దలు ఈ మేరకు తీర్మానించారు. ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ప్రతీ ఏటా ఈ ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.