ఆమనగల్లు పరిసరాల పరిశుభ్రతకు ప్రజలంతా నడుంబిగించాలని చైర్మన్ పిలుపు

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

ఈరోజు ఆమనగల్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి పర్యవేక్షణ చేపట్టిన చైర్మన్ పత్య నాయక్ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎక్కడైనా పారిశుద్ధ్య లోపం కనిపిస్తే వెంటనే సిబ్బందిని సంప్రదించి బాధ్యతగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.