అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్ కాల్
రిపోర్టర్: కిరణ్
స్థలం: న్యూఢిల్లీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఫోన్లో మాట్లాడుకున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. గ్లోబల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.