ప్రకృతి మాత పరిరక్షణకై పలాసలో మట్టి గణపతుల పంపిణీ

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస శివాజీనగర్లో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకై మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దువ్వాడ శ్రీధర్ బాబా పాల్గొని భక్తులకు మట్టి గణనాథుల విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మంలో మట్టి వినాయకుడి పూజకు ప్రత్యేక విశిష్టత ఉందన్నారు. 21 రకాల పత్రాల పూజ ప్రకృతి పట్ల మన పూర్వీకుల గౌరవానికి నిదర్శనమని తెలిపారు. రసాయన విగ్రహాల వల్ల జలవనరులు కలుషితం కాకుండా పలాస ప్రజలందరూ బాధ్యతగా మట్టి వినాయకులనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.