దేశవ్యాప్తంగా యాభై వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో పండుగల వేళ యాభై వేల మందికి పైగా యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా యాభై ఒక్క వేలకు పైగా యువతకు ఇవాళ అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ విజయం వెనుక యువత అంకితభావంతో కూడిన కఠిన శ్రమ దాగి ఉందని ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు. ఈ నియామకాలతో వేలాది కుటుంబాల్లో నూతన ఆనందాలు వెల్లివిరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.