'డిజైన్ల అనుమతులపై త్వరలోనే నిర్ణయం': పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో సంజీవ్ వోహ్రా
రిపోర్టర్: శివ
స్థలం: Eluru
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఈసీఆర్‌ఎఫ్ డ్యాం డిజైన్ల పురోగతిపై పీపీఏ సీఈవో సంజీవ్ వోహ్రా బుధవారం పోలవరం క్యాంపు కార్యాలయంలో జలవనరులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్యాప్-1, 2 పనులను పరిశీలించిన ఆయన, పెండింగ్‌లో ఉన్న డిజైన్ల అనుమతులపై చర్చించారు. క్లే రిచ్‌లో 25 లెవెల్ వరకు అనుమతులు రాగా, 53 లెవెల్ సహా ఇతర డిజైన్లు కేంద్ర జలసంఘం పరిశీలనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి, ఎస్‌ఈ పి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.