కాంగ్రెస్ అసమర్థత వల్లే రాష్ట్రంలో తీవ్ర కరువు: కేటీఆర్ మండిపాటు
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆదిలాబాద్
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎగ్గొట్టిన మూడు విడతల రైతుబంధు బకాయిలతో పాటు ప్రస్తుత యాసంగి పంట పెట్టుబడి సాయాన్ని కలిపి ఎకరానికి రూ.60 వేల చొప్పున వెంటనే చెల్లించాలని ఆయన ఆదిలాబాద్ రైతు గర్జన సభలో స్పష్టం చేశారు. పుష్కలంగా నీటి వనరులు ఉన్నప్పటికీ ప్రభుత్వ వైఫల్యం వల్లే తెలంగాణ రైతులు కరువు కోరల్ లో చిక్కుకున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.