కొత్తవలసలో వైకాపాకు భారీ షాక్ అయిదుగురు జడ్పీటీసీల రాజీనామా

రిపోర్టర్: శివ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా కొత్తవలసలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఒకే రోజు అయిదుగురు జడ్పీటీసీ సభ్యులు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిలో ముగ్గురు జడ్పీ మాజీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అడుగుజాడల్లో నడుస్తూ తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల సమయానికి వైకాపాను వీడి మరికొందరు నేతలు కూడా తెదేపా బాట పట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.