మంథనిలో రూ 20 లక్షలతో తీరనున్న గ్రామీణ రోడ్డు కష్టాలు

రిపోర్టర్: T. SRAVAN స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని మల్హర్ మండలం రాఘవయ్యపల్లె నుంచి సదర్ వరకు నూతన రోడ్డు నిర్మాణానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులతో రోడ్డు అభివృద్ధి చేయడం ద్వారా గ్రామ ప్రజల రాకపోకల కష్టాలు పూర్తిగా తొలగిపోయి రవాణా సౌకర్యం సులభతరం కానుంది.