అనుమతి లేకుండా చెట్లు నరికిన వ్యక్తిపై అటవీశాఖ కొరడా

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్ రూరల్ ఇందల్వాయి రేంజ్ పరిధిలోని పడకల్ గ్రామంలో అనుమతులు లేకుండా చెట్లు నరికిన వ్యక్తిపై అటవీ శాఖ అధికారులు బుధవారం కేసు నమోదు చేశారు. తన పట్టా భూమిలో ఎలాంటి అనుమతి తీసుకోకుండా పదిహేడు మోదుగ చెట్లు, ఒక వేప చెట్టును నరికివేశారు. వాల్టా చట్టం అలాగే అటవీ సంరక్షణ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎఫ్ఆర్వో రవి మోహన్ తెలిపారు.