'పసిపాప వైద్యానికి రూ.3.51 లక్షల సాయం': కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మానవత్వం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Kovur

కోవూరు నియోజకవర్గంలో 7 రోజుల పసిపాప ప్రాణాలను కాపాడేందుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి అత్యవసర చికిత్స నిమిత్తం రూ.3.51 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. బాధితులకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యే చూపిన ఈ మానవతా దృక్పథంపై స్థానికంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.