పెద్ద అప్పలరాజుపై దుష్ప్రచారం ఆపాలి: మంత్రి నారా లోకేశ్
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
రాష్ట్రం గర్వించే క్రీడాకారుడు పెద్ద అప్పలరాజును అవమానించడం ఆపాలని వైకాపా అధినేత జగన్కు మంత్రి నారా లోకేశ్ హితవు పలికారు. డీఎస్సీ క్రీడా కోటా ఉద్యోగాలపై జగన్, ఆ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన నేషనల్ ఛాంపియన్ అని, పూర్తి స్థాయి తనిఖీ చేశాకే ఉద్యోగం ఇచ్చామని స్పష్టం చేశారు. అప్పలరాజుపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు.