విశాఖ ఎండాడలో కొండలను కొల్లగొడుతూ అక్రమ విక్రయాలు సాగిస్తున్న కబ్జాదారులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం ఎండాడ దుర్గానగర్ ప్రాంతంలో అక్రమార్కులు కొండలను తవ్వి చదును చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఎనిమిదో వార్డు పరిధిలోని సర్వే నంబరు-1తో పాటు వివిధ కాలనీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా ఆక్రమణదారులు వాటిని తొలగించి నిర్మాణాలు చేపడుతున్నారని సమాచారం. ఈ అక్రమ దందాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో సంగీత్ మాథుర్ స్పష్టం చేశారు.