నాని ది ప్యారడైజ్ మూవీలో గద్దర్ చారిత్రాత్మక గీతం రీమిక్స్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్ చిత్రంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ రాసిన ప్రసిద్ధ అమర గీతం పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పాటను రీక్రియేట్ చేసి ఉపయోగిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఈ లెజెండరీ సాంగ్ ఉంటే థియేటర్లలో భావోద్వేగాలు వేరే లెవెల్‌లో ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు.