జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పదవీకాలం పూర్తిపై ఆత్మీయ సన్మానం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పదవీకాలం ముగిసిన సందర్భంగా మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పదవీకాలం ఎంతో నేర్పించిందని, ఎక్కడా తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తనకు లభించిన పేరు ప్రతిష్టలకు ఉద్యోగులు, అధికారుల సహకారమే కారణమని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.