విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత భవనాల పనులు శరవేగంగా

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా చినమేడల్లి-మర్రివలస గ్రామాల పరిధిలో సుమారు 561 ఎకరాల్లో రూ.800 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత భవనాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 70 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని, వచ్చే విద్యాసంవత్సరం నాటికి సొంత భవనంలోకి మారేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వర్సిటీ వీసీ టి. శ్రీనివాసన్ వెల్లడించారు. తాత్కాలిక భవనాల్లో వసతుల లేమితో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు శాశ్వత భవనాలతో ఈ కష్టాలు తీరనున్నాయి.