'అభివృద్ధి పనులు పూర్తి చేయలేకపోయాం': నెల్లూరు జడ్పీ చివరి సమావేశం
రిపోర్టర్: రమేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా పరిషత్ ప్రస్తుత పాలకవర్గం చివరి సర్వసభ్య సమావేశం గురువారం జరగనుంది. 2021 సెప్టెంబరులో ఏర్పాటైన ఈ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఈ సమావేశంలో గత ఐదేళ్ల అభివృద్ధి నివేదికలు, పల్లెల్లో కరవు పరిస్థితులు, తాగునీరు, వ్యవసాయంపై సమీక్షించనున్నారు. పలు భవనాల ప్రారంభోత్సవాలు నోచుకోకపోవడంపై జడ్పీటీసీ సభ్యుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.