అంగన్వాడీల పెన్షన్ దరఖాస్తుల తిరస్కరింపుపై పెల్లుబికిన సీఐటీయూ నిరసన గళం

రిపోర్టర్: venkat స్థలం: కుక్కునూరు

అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్ల పెన్షన్ దరఖాస్తులను నాట్ ఎలిజిబుల్ పేరుతో తిరస్కరించడం సరికాదని సీఐటీయూ ఏలూరు జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కుక్కునూరు డిప్యూటీ ఎంపీడీవో షరీఫ్కు మండల కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. తిరస్కరించిన దరఖాస్తులను పునఃపరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దార కృష్ణ, కోట రాజు తదితరులు పాల్గొన్నారు.