నేపాల్ లో గంజాయి సాగుకు గ్రీన్ సిగ్నల్: మూడు నెలల్ లో విధివిధానాలు రూపొందించాలని ఆదేశం

రిపోర్టర్: శివ స్థలం: Kathmandu

వైద్య, పారిశ్రామిక అవసరాల నిమిత్తం నియంత్రిత గంజాయి సాగుకు అనుమతిస్తూ మూడు నెలల్లోగా తగిన విధివిధానాలను రూపొందించాలని నేపాల్ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. యాభై ఏళ్ల క్రితం విధించిన నిషేధాన్ని సడలిస్తూ 1976 నాటి చట్టంలోని నిబంధనలను అమలు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే వినోద రంగ వినియోగానికి మాత్రం చట్టపరమైన నిషేధం యథావిధిగా కొనసాగుతుందని న్యాయ నిపుణులు తెలిపారు.