గుంటూరు జిల్లాలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన

రిపోర్టర్: కృష్ణ స్థలం: ప్రకాశం

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణ పైలెట్ ప్రాజెక్టుకు కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. పీఎంఏవై గ్రామీణ్-2.0 కింద రాష్ట్రానికి మంజూరైన ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన వసతులు అందనున్నాయని ఆయన పేర్కొన్నారు.