అయోధ్య రామ మందిరానికి అరుదైన గుర్తింపు: ఎఫ్ఎస్ఎస్ఏఐ అత్యున్నత రేటింగ్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అయోధ్య
అయోధ్య రామ మందిరానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అరుదైన గుర్తింపు లభించిందని, భోగ్ కార్యక్రమంలో భాగంగా అత్యున్నత అతి విశిష్ట రేటింగ్ దక్కిందని ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు. ప్రసాదం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించినందుకు ఈ గౌరవం దక్కిందని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో రజిత్ పున్హాని వెల్లడించారు. భక్తులకు స్వచ్ఛమైన ప్రసాదం అందించేందుకు ఈ ధ్రువీకరణ దోహదపడుతుందని, అయోధ్యలోని మరో ఐదు దేవాలయాలకు కూడా ఈ సర్టిఫికేషన్ లభించిందని అధికారులు స్పష్టం చేశారు.