వినాయక ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు: ఎస్‌ఐ రవీందర్
రిపోర్టర్: మహేష్
స్థలం: నల్గొండ
కట్టంగూర్ మండలంలో వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్‌ఐ మునుగోటి రవీందర్ స్పష్టం చేశారు. మండపాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని హెచ్చరించారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే తక్కువ శబ్దంతో నిబంధనలు పాటించాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.