ప్రభుత్వ భూమిలో దర్జాగా రోడ్డు: సంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం

రిపోర్టర్: శివ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి విల్లాల కోసం రోడ్డు నిర్మించినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 213లోని అసైన్డ్ భూమిని ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా వాడుకుంటున్నారని, ముప్ పై రోజులుగా ఫిర్యాదు చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం కాలయాపన చేస్తూ దాటవేత ధోరణి అవలంబిస్తోందని స్థానికులు ఆరోపించినట్లు వెల్లడైంది.