ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భూమిపూజ

రిపోర్టర్: రాము స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ధంసలాపురం రెవెన్యూ పరిధిలో కొత్తగూడెం, అల్లీపురం గ్రామాల మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి సోమవారం ఘనంగా భూమి పూజ జరిగింది. చినజీయర్ స్వామి చేతుల మీదుగా శిలాన్యాస పూజలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆలయ శంకుస్థాపన వేడుకలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.