మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు: వంగవీటి రాధాకృష్ణ స్పష్టత
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయవాడ
ఎంపీ కేశినేని చిన్నితో తనకు ఎలాంటి విభేదాలు లేవని జనసేన విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. నగరంలో నిర్వహించిన కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ విజయవాడ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తామని వెల్లడించారు. కూటమిలో ఎలాంటి సమన్వయ లోపం లేదని, నామినేషన్ సమయంలో కూడా అందరం కలిసికట్టుగా ర్యాలీ నిర్వహించామని రాధాకృష్ణ తెలిపారు.