అసంఘటిత రంగ ఉపాధిలో కడప జిల్లాదే ప్రథమ స్థానం

రిపోర్టర్: నరేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో అసంఘటిత రంగ వ్యాపార సంస్థలు ప్రకాశం జిల్లాలో అత్యధికంగా నడుస్తుండగా, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో అత్యధికంగా 3.26 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. నంద్యాల జిల్లాలో మహిళా యాజమాన్యాలు, కార్మికులు అత్యధికంగా ఉన్నారు. కాకినాడలో అత్యధిక వేతనాలు చెల్లిస్తుండగా, కర్నూలులో కనిష్ఠ వేతనాలు నమోదయ్యాయి.