జనవరి 2027లో సీఏ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఐసీఏఐ
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా జనవరి 2027లో జరగనున్న చార్టర్డ్ అకౌంటెన్సీ ఫౌండేషన్ మరియు ఇంటర్మీడియట్ పరీక్షల పూర్తి షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. ఇంటర్మీడియట్ గ్రూప్ 1 పరీక్షలు జనవరి 2, 4, 6 తేదీలలో, గ్రూప్ 2 పరీక్షలు జనవరి 8, 10, 12 తేదీలలో జరుగుతాయి. ఫౌండేషన్ పరీక్షలు జనవరి 3, 5, 7, 9 తేదీలలో నిర్వహించనున్నట్లు ఐసీఏఐ స్పష్టం చేసింది.