దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ స్థాయిలో పలు ఇంధన పురస్కారాలు
రిపోర్టర్: గోపి
స్థలం: సికింద్రాబాద్
ఇంధన సామర్థ్యం పెంపు, విద్యుత్ పొదుపు చర్యల్లో ప్రతిభ కనబరిచినందుకు దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు లభించాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన 27వ జాతీయ ఇంధన సామర్థ్య నిర్వహణ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు. కాచిగూడ రైల్వే స్టేషన్కు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డు దక్కగా, లాలాగూడ ఆసుపత్రితో పాటు పలు కీలక యూనిట్లకు పురస్కారాలు లభించాయి.