విద్యార్థులకు అలర్ట్: మార్చి 2027 ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో మార్చి 2027 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ను ఇంటర్మీడియట్ విద్య బోర్డు తాజాగా విడుదల చేసిందని అధికారులు తెలిపారు. ఫస్ట్, సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన వారు, ప్రైవేట్ అభ్యర్థులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 లోపు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అదనపు రుసుముతో డిసెంబర్ 14 వరకు గడువు ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది.