పాలఘర్‌లో ఎమ్మెల్యే కుమారుడు రోహిత్ గావిత్ అరెస్ట్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: மகாராஷ்டிரா

మహారాష్ట్రలోని పాలఘర్‌లో ఆసుపత్రిపై దాడి కేసులో ఎమ్మెల్యే రాజేంద్ర గావిత్ కుమారుడు రోహిత్ గావిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దహి హండి వేడుకల సమయంలో రిలీఫ్ ఆసుపత్రిలో వీరంగం సృష్టించి, సిబ్బందిపై దాడి చేసిన కేసులో మరో తొమ్మిది మంది గోవిందాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, సెప్టెంబర్ 13 వరకు రిమాండ్ విధించారు.