లాభాల బాటలో పయనిస్తున్న ఏపీఎచ్ఎంఈఎల్ సంస్థ ప్రగతి

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఆంధ్రప్రదేశ్

నష్టాల్లో కూరుకుపోయి మూసివేత అంచున ఉన్న ఏపీఎచ్ఎంఈఎల్ సంస్థ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో వరుసగా లాభాలను నమోదు చేస్తూ ప్రగతి పథంలో పయనిస్తోంది. సింగరేణి ఆధీనంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రణాళికలతో ముందుకు సాగుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.23.33 కోట్ల రికార్డు నికర లాభాన్ని సాధించింది. గత మూడేళ్లలో రూ.34.20 కోట్ల నికర లాభాలను ఆర్జించి జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతోంది.