రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో భారీ రిజిస్ట్రేషన్ కుంభకోణం

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మరో భారీ స్కామ్‌ వెలుగు చూసింది. రిజిస్ట్రేషన్ల చలాన్లలో భారీ అక్రమాలు జరిగాయని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. రూ.లక్షలు కట్టాల్సిన చోట కేవలం వేలల్లోనే కట్టి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. గచ్చిబౌలి డైమండ్‌ హిల్స్‌లో రూ.1,000 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.