రాకెట్రీ సినిమా కోసం మాధవన్ కఠిన శారీరక మార్పులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Hyderabad

ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ తన రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ సినిమా కోసం ఎలాంటి కృత్రిమ వస్తువులు వాడకుండానే శారీరక మార్పులు చేసుకున్నట్లు తెలిపారు. అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన ఇరవై తొమ్మిది నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల వయసుల పాత్రను వంద శాతం సహజంగా నటించి మెప్పించారు. ఈ మేరకు బరువు పెరగడానికి, తగ్గడానికి ఆయన రెండున్నరేళ్ల పాటు ప్రత్యేక కసరత్తులు చేసినట్లు పేర్కొన్నారు.