అభివృద్ధి పనుల బాధ్యత ప్రజాప్రతినిధులు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
రాష్ట్రంలో అమలవుతున్న వేలకోట్ల అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో నాయకత్వం వహించి పనులను ముందుకు నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ అధికారిక ఎక్స్ వేదికగా కీలక సూచనలు చేసింది. పాలనలో పారదర్శకత, ప్రగతి వేగవంతమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.