ఏటూరునాగారంలో గుడుంబా స్థావరంపై దాడి: రెండు వేల లీటర్ల పానకం స్వాధీనం
రిపోర్టర్: రమేష్
స్థలం: ములుగు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో పోలీసులు అక్రమ గుడుంబా స్థావరంపై మెరుపు దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ బి. మహేష్ తెలిపారు. ఈ దాడులలో యాభై లీటర్ల గుడుంబా తయారీ సరుకుతో పాటు సుమారు రెండు వేల లీటర్ల పానకాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. స్థానికంగా అక్రమంగా ఈ దందా నిర్వహిస్తున్న గడిచర్ల నారాయణ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.