తిరుపతిలో జాతీయ స్థాయి డీజీపీల సదస్సు: ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

రిపోర్టర్: కృష్ణ స్థలం: తిరుపతి

దేశ అంతర్గత భద్రతపై వచ్చే నెల డిసెంబర్ నాలుగు నుంచి ఆరు వరకు తిరుపతిలో జాతీయ స్థాయి డీజీపీల వార్షిక సదస్సు జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ వెల్లడించారు. అమరావతి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్న ఈ సదస్సు ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రత, రవాణా, వసతి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను స్పష్టంగా ఆదేశించారు.